హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ యుద్ద నౌకలను పంపించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను కోరారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురును స్వీకరించే ప్రపంచ దేశాలు ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హార్ముజ్ మూసివేతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలన్నీ తమ యుద్ద నౌకలను ఆ ప్రాంతానికి పంపించాలని, అమెరికా వారికి సాయంగా ఉంటుందన్నారు ట్రంప్.
శనివారం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ద్వారా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. “హార్ముజ్ జలసంధి ద్వారా చమురును స్వీకరించే ప్రపంచ దేశాలు ఆ మార్గాన్ని సురక్షితంగా చూసుకోవాలి. మేం సాయం చేస్తాం అని ట్రూత్ సోషల్ రాశారు ట్రంప్.
ప్రపంచ దేశాలను అమెరికా సమన్వయం చేస్తోంది.. త్వరలో హార్ముజ్ ను తెరుచుకుంటుందన్నారు. ప్రపంచ దేశాలకు ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా హార్ముజ్ నుంచే జరుగుతుంది.ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం ఇది. ఈ ఛానల్ద్వారా ఇరాన్ నౌకయానాన్ని అడ్డుకుంటోందన్నారు ట్రంప్.
ఇరాన్ హార్ముజ్ ను మూవేయడంతో ప్రభావితమైన దేశాలు జలసంధిని తెరిచి, నౌకల ప్రయాణం సురక్షితం చేయడానికి యుద్ద నౌకలను పంపుతాయి.. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ , కూడా ఈ ప్రాంతానికి నౌకలను పంపుతారని ఆశిస్తున్నానని ట్రంప్ పోస్ట్ లో రాశారు. తీరప్రాంతంలో అమెరికా బాంబుల దాడులు చేస్తూనే ఉంటుంది, ఇరానియన్పడవలు, ఓడలను నీటిలో ముంచివేస్తూనే ఉందని ట్రంప్ రాశారు.
