బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్‌తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేశ్, ఢిల్లీ రియల్టర్ నిబిద్ శర్మ, మిశ్రా, రితేశ్ రెడ్డి, మొరగనేని రమేశ్, శ్రవణ్, నల్లపునేని విజయకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లిక్కర్, డ్రగ్స్ పార్టీ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన పార్టీలో.. డ్రగ్స్, లిక్కర్ తీసుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. కాగా, అప్పటికే బయట గేట్ వద్ద ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఈగల్ పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి సహా ఫ్యూచర్ సిటీ, ఎస్‌వోటీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. గేట్ వద్ద ఉన్న వారిని అడ్డుతొలగించుకుని లోపలికి వెళ్లారు. అప్పటికే పార్టీ జరుగుతుండగా.. ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్‌తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో రెండు గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతోపాటు రోహిత్ రెడ్డి, పుట్ట మహే శ్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా.. రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కాగా, డ్రగ్స్ ఎవరి వద్ద లభించిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
10 మంది వీళ్లే...
చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ లో పైలెట్ రోహిత్ రెడ్డి కి చెందిన వీఎమ్ ఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో రైడ్ చేశాము. ఈగల్ టీమ్ ను చూసి ముందు నమిత్ శర్మ గాల్లోకి ఫైరింగ్ చేశారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్ ఒక లైవ్ గ్రౌండ్ ఒక ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నాము. మొత్తం పదిమందిలో ఒక మహిళ ఉన్నారు పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, రియాల్టర్స్ ఉన్నారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ టిడిపి పుట్టా మహేష్ కుమార్ . మిగతా వారిలో ఏం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి,విజయ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. పదిమందికి డ్రగ్ టెస్ట్ చేస్తే ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్ హాస్పిటల్ కి పంపించాం. గన్ లైసెన్స్ ఉండి అది రితేష్ రెడ్డిది కాగా నమిత్ మిశ్రా ఫైర్ చేయడం జరిగింది. పైలెట్ రోహిత్ రెడ్డి నమిత మిశ్రా రితేష్ రెడ్డి, కౌశిక్ రవి,అర్జున్ రెడ్డి కి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయం పై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాన్ని బట్టి వైరింగ్ చేసిన వాళ్లపై యాక్షన్ ఉంటుంది.
నెట్వర్కింగ్ కోసం వీకెండ్ పార్టీ చేసుకున్నట్టుగా చెబుతున్నారు పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజ్ చేశారు. పదిమందిలో ఒక మహిళ షరీఫ్ రెడ్డి వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. తను కౌశిక్ రవితో కలిసి పార్టీకి వచ్చింది. రెండు గ్రాముల వైట్ పౌడర్ ని సీజ్ చేశాం. అది ఏంట్రాగ్ అనేది టెస్ట్ తర్వాత చెప్పగలం. పాజిటివ్ వచ్చిన ఐదుగురు ఇక్కడ డ్రగ్ తీసుకోలేదు గతంలో వేరే దగ్గర తీసుకున్నామని చెబుతున్నారు కంప్లీట్ టెస్ట్ తర్వాత పూర్తిగా తెలుస్తుంది. ఫామ్ హౌస్ ల మీద కార్డెన్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము మాకు ఇంటలిజెన్స్ టీం కూడా ఉంది అని చెప్పారు.
