ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి.. యుద్దనౌకలు పంపించాలని.. ట్రంప్ పిలుపుకు స్పందించిన చైనా  

ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి.. యుద్దనౌకలు పంపించాలని.. ట్రంప్ పిలుపుకు స్పందించిన చైనా  

అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగాయి. చాలా చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. హార్ముజ్​ మార్గాన్ని సురక్షితం చూసుకునేందుకు యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ దేశాలను కోరారు. ఇంధన భద్రతా భయాలు పెరుగుతున్న క్రమంలో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని చైనా పిలుపునిచ్చింది.

హార్ముజ్​ జలసంధి ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి చైనాతో సహా అనేక దేశాలు యుద్ధనౌకలను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన కొన్ని గంటల తర్వాత, చైనా ,యుకె స్పందించాయి. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి సిఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ, చైనా తక్షణమే శత్రుత్వాలను విరమించుకోవాలని కోరుకుంటోందని, స్థిరమైన ,అడ్డంకులు లేని ఇంధన సరఫరాను నిర్ధారించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని అన్నారు.

యుకె రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, వ్యూహాత్మక షిప్పింగ్ మార్గం భద్రతను నిర్ధారించడానికి వారు ఇప్పటికీ అనేక ఎంపికలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు.

హార్ముజ్ జలసంధి భద్రత ఎల్లప్పుడూ  సమిష్టి ప్రయత్నం అయి ఉండాలని ట్రంప్ మార్చి 14న ట్రూత్ సోషల్ పోస్ట్‌లో  రాశారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురును స్వీకరించే ప్రపంచ దేశాలు ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. అమెరికా వారికి సహాయం చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు.