ఒక్క స్టూడెంట్‌‌‌‌ కోసం ఐదుగురు సిబ్బంది..అయినా ఎగ్జామ్ రాయలే

ఒక్క స్టూడెంట్‌‌‌‌ కోసం ఐదుగురు సిబ్బంది..అయినా ఎగ్జామ్ రాయలే

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు: ఇంటర్​ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించే జనరల్  బ్రిడ్జి కోర్స్(మాథ్స్) ​పరీక్షకు ఫీజు కట్టిన విద్యార్థి కోసం శనివారం నాగర్ కర్నూల్  జిల్లా కేంద్రంలో ఎగ్జామ్​ సెంటర్ ఏర్పాటు చేశారు. ఒక చీఫ్ సూపరింటెండ్, ఇన్విజిలేటర్, అటెండర్, బందోబస్తు డ్యూటీ కోసం కానిస్టేబుల్​ను నియమించారు. ఉదయం 9 దాటినా ఫీజు కట్టిన సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి రాకపోవడంతో ఐదుగురు సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది.

 ఇంటర్  అనంతరం జనరల్  బ్రిడ్జి కోర్స్(మ్యాథ్స్) పరీక్ష రాయడానికి కమ్మరి వరుణ్  సందేశ్  ఫీజు కట్టాడు. జిల్లా మొత్తంలో ఒక్కడే ఫీజు కట్టగా, ఈ ఒక్కడి కోసం జిల్లా కేంద్రంలో ఎగ్జామ్​ సెంటర్​ ఏర్పాటు చేశారు. జిల్లా వృత్తి విద్యాధికారి వెంకటరమణతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, అటెండర్, బందోబస్తు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్  పోలీస్ స్టేషన్  నుంచి క్వశ్చన్  పేపర్  తెచ్చి రెడీగా కూర్చున్నారు. ఫీజు కట్టిన విద్యార్థి గైర్హాజరు కావడంతో ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.