దారి కాచి కత్తులతో నరికి హత్య.. నాగర్ కర్నూల్ జిల్లా రేవల్లి గ్రామంలో ఘటన

దారి కాచి కత్తులతో నరికి హత్య.. నాగర్ కర్నూల్ జిల్లా రేవల్లి గ్రామంలో ఘటన

కల్వకుర్తి,వెలుగు: దారి కాచి బైక్‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న వ్యక్తిని కత్తులతో నరికి చంపిన ఘటన నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్​జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఊర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ల యాదయ్య(45) శుక్రవారం రాత్రి మిడ్జిల్ మండలం బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలో జరిగిన మొహరం ఉత్సవాలకు హాజరై, బైక్‌‌‌‌‌‌‌‌పై ఇంటికి వెళ్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు దారి కాచి అతడిని అడ్డగించారు.

కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యాదయ్య డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ భీమ్‌‌‌‌‌‌‌‌కుమార్, ఎస్సై రమాదేవి తెలిపారు. కాగా మృతుడు గతంలో క్షుద్ర పూజలు చేసేవాడని, అందుకే హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.