రాజకీయ స్వార్థం కోసం  మూసీ అభివృద్ధిని అడ్డుకుంటారా?

రాజకీయ స్వార్థం కోసం  మూసీ అభివృద్ధిని అడ్డుకుంటారా?
  • కేటీఆర్, హరీశ్‌‌‌‌లపై కైలాశ్ నేత ఫైర్

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి అని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత విమర్శించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మూసి వల్ల నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో బాధపడుతుంటే..సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రక్షాళన చేసి జిల్లా ప్రజలకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే దీనికి కేటీఆర్, హరీశ్ లు అడ్డుతగలడం ఏంటని ప్రశ్నించారు.

తామేం పాపం చేశామని ఫ్లోరోసిస్ వ్యాధితో నరకం అనుభవించాలంటూ  నల్గొండ ప్రజలు కన్నీరు కారుస్తున్నారని.. దీనికి కేటీఆర్, హరీశ్ లు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు నల్గొండ జిల్లా ప్రజల ఓట్లు కావాలి తప్ప..వారి బాధలు పట్టవా అని నిలదీశారు. తమ రాజకీయ స్వార్థం కోసం మూసీ ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నాలను మానుకొని నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యవంతమైన జీవితం కోసం నది అభివృద్ధికి కేటీఆర్, హరీశ్ లు సహకరించాలని ఆయన కోరారు.