హైదరాబాద్లో మూడ్రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్లో మూడ్రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో నేడు (శుక్రవారం), రేపు(శనివారం), ఎల్లుండి(ఆదివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లో అలెర్ట్(6.4 సెం.మీ. – 11.5 సెం.మీ.) ప్రకటించారు. గురువారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సులేమాన్ నగర్ లో 1.1సెం.మీ., బహదూర్ పురాలో సెంటిమీటరు వాన పడింది. రాజేంద్రనగర్, బండ్లగూడ, ఆసీఫ్ నగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సమస్యలు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కి 040–21111111; 90001 13667 నంబర్ల​కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.