ధన్ తెరాస్ పర్వదినం సందర్భంగా బంగార విక్రయాలు మెరుపులు మెరిపిస్తా యని భావించి న దుకాణ దారులకు ఈసారి భిన్నమైన స్పం దనే కనిపించింది.బంగారం ధర పెరు గుతుండటంతో, ధన్ తెరాస్ కుకస్టమర్ల నుంచి డిమాం డ్ తగ్గిపోయిం ది. దీంతో బంగారం, ఆభరణాల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగాయి. క్వాలిటీ, మెరుగైన డిజైన్లతో,ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిం చాలని జువెలరీ కాణదారులు భావిం చారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. బంగారం, వెం డి, ఇతర విలువైన వస్తువులు కొనడానికి ధన్ తెరాస్ ను ఎంతో పవిత్రమైన రోజుగా కొలుస్తారు. ముఖ్యం గా ఉత్తర,పశ్చిమ భారతాల్లో ఎక్కువగా ఈ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకుంటారు .షాపులకు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగినప్పటి కీ, అమ్మకాలు మాత్రం ఆ స్థాయిలో లేవని ఆల్ ఇండియాజెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్ ) చైర్మన్ నితిన్ ఖండేల్ వాల్ చెప్పారు. 10 గ్రాముల బంగారం ధర రూ.32వేలకు మించి ఉండటంతో, చాలా మంది కస్టమర్లు కొనుగోళ్లపై పరిమితి విధిం చుకున్నారని తెలిపారు. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.32,690గా నమోదైంది. గతేడాది ఈ ధర రూ.30,710గానే ఉండేది. ధరలు అత్యధికంగా ఉండటంతో, బంగారానికి డిమాం డ్ తగ్గిపోయినట్టు ఢిల్లీ బులియన్ అసోసియేషన్ సురేం ద్ర జైన్ కూడా తెలిపారు . ఈ సమయంలో కస్టమర్లు ఎక్కువగా కాయిన్ల కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతారని ఓ గోల్డ్ రిఫైనర్ రాజేష్ కోస్లా చెప్పారు . ఇంతకు ముందు పది గ్రాముల బంగారం ధర రూ.30వేలు ఉండేది,కానీ గత కొన్ని నెలలుగా పెరు గతున్న బంగారం ధర ఈసారి రూ.32వేలకు పెరగడంతో, మార్కెట్ ఇంకా అడ్జెస్ట్ కాలేకపోతుందన్నారు. మోడీ ఫేస్ తో గోల్డ్ , సిల్వర్ బార్స్…ధన్ తేరాస్ పర్వదినం సందర్భంగా గుజరాత్ సూరత్ లోని ఓ జువెలరీ షాపు వినూత్నం గా ఆలోచించిం ది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫేస్ తో తీర్చిదిద్దిన గోల్డ్, సిల్వర్ బార్స్‌ను విక్రయించిం ది. కేవలం మోడీ ఫేస్ ను మాత్రమే కాక, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫేస్ తో ఉన్న గోల్డ్, సిల్వర్ బార్స్‌ను కూడా అందించిం ది. ‘ప్రతి దీపా వళికి గణేష్ ను, లక్ష్మీదేవిని దేవతలుగా కొలుస్తారు. ప్రధానమంత్రి కూడా మాకు దేవుడి లాంటి వాడే’ అని ఓ కస్టమర్ చెప్పారు. ప్రధాని ఫేస్ తో జువెలరీని అందిం చడం ఇదే తొలిసారి కాదు.ఆగస్ట్‌లో కూడా ఈ షాపు.. ప్రధానమంత్రి మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఫోటోలతో గోల్డ్ రాఖీలను తయారీచేసి విక్రయిం చగా వినియోగదారుల నుంచి విశేష స్పం దన వచ్చిం ది.
