ఇండియాలోనే అతిపెద్ద డయాలసిస్ నెట్‌వర్క్ కంపెనీ , హైదరాబాద్‌కు చెందిన నెఫ్రోప్లస్ …అమెరికా కంపెనీ డేవిటా కేర్ ఇండియా విభాగాన్ని కొనుగోలు చేసిం ది. ఫలితంగా దేశవ్యాప్తంగా డావిటా కేర్‌కు చెం దిన 22 డయాలసిస్ , కిడ్నీ సంరక్షణ కేం ద్రాలు నెఫ్రోప్లస్ చేతికి వస్తాయి. విలీనం కారణంగా నెఫ్రోప్లస్ కు మొత్తం 176 డయాలసిస్ టర్లు ఉంటాయి. డావిటా కేర్ 1,700 మంది
రోగులకు సేవలు అందిస్తోంది. అయితే ఒప్పందం విలువను మాత్రం కంపెనీ వెల్లడిం చలేదు. ఈ సందర్భంగా నెఫ్రోప్లస్ సీఈఓ, ఫౌండర్ వుప్పల విక్రమ్ మాట్లాడుతూ ‘‘డావిటా కేర్‌లో వందశాతం వాటా కొనుగోలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎని-
మిదేళ్ల క్రితం మొదలైన మా సంస్థ 18 రాష్ట్రా ల్లో ని 90కిపైగా నగరాల్ లో వ్యాపించిం ది. ప్రస్తుతం 1,200 మంది రోగులకు సేవలు అందిస్తున్నది. డావిటా కేర్‌ను దక్కిం చుకోవడం వల్ల కస్టమర్ల సంఖ్య మరిం త పెరు గుతుంది. ప్రస్తుతం మేం ఇండియా తోపాటు నేపాల్ లో సేవలు అందిస్తున్నాం . త్వరలో ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో డయాలసిస్ కేం ద్రాల ను ఏర్పాటు చేయబోతున్నాం . ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయి’’ అని వివరిం చారు. సంస్థ వైస్ -ప్రెసిడెంట్ డాక్టర్ వేదా సంపత్ మాట్లాడుతూ డావిటా
కేర్‌ను కొనడం వల్ల కంపెనీ మరిం త అభివృద్ధి చెందుతుందని, కస్టమర్లు రెట్టిం పవుతారని పేర్కొన్నారు.ప్రస్తుతం తమ కంపెనీ లో 2,300 మంది పనిచేస్తున్నారని, డావిటాలో 400 మంది ఉద్యోగులు ఉన్నారని వివరిం చారు. త్వరలో రాజస్థాన్ , కశ్మీర్‌లోనూ
డయాలసిస్ సెం టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు .
