డైనోసార్ల అంతం: కార్చిచ్చులు, సునామీల వల్లే

డైనోసార్ల అంతం: కార్చిచ్చులు, సునామీల వల్లే

    6.5 కోట్ల ఏళ్ల కిందట వెయ్యి కోట్ల అణు బాంబుల శక్తితో భూమిని ఢీ కొట్టిన భారీ ఉల్క

    డైనోసార్లు సహా ప్రపంచంలోని  75 శాతం జీవులు నాశనం

 

ఒకప్పుడు భూమిని ఏలిన డైనోసార్లు ఓ పెద్ద ఉల్క(శకలం) తాకిడికి నామరూపాల్లేకుండా పోయాయని విన్నాం కదా. ఆ ఉల్క ఢీకొట్టిందనడానికి ఆధారాలను తాజాగా సైంటిస్టులు కనుగొన్నారు. 6.5 కోట్ల ఏళ్ల కిందట సుమారు 1,000 కోట్ల అణుబాంబుల శక్తితో ఆ శకలం భూమిని తాకడంతో ప్రపంచంలోని 75 శాతం జీవులు నశించిపోయాయని చెప్పారు. ఆ తర్వాత అడవుల్లో కార్చిచ్చులు, సునామీలు, సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేఘాలతో భూమి అల్లకల్లోలమైందన్నారు. మెక్సికో దగ్గర యుకటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో పసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహా సముద్రం కిందున్న చిక్సులుబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొయ్యిలోని రాళ్ల శాంపిళ్లను పరిశీలించి టెక్సాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ వివరాలు తెలుసుకున్నారు. పరిశోధన కోసం సముద్రంలోని గొయ్యిలో ఓ కిలోమీటరున్నర మేర లోపలికి తవ్వారు. యుకటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వీపకల్ప పోర్టుకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిలోని ఈ గొయ్యి సుమారు 185 కిలోమీటర్ల వెడల్పు, 32 కిలోమీటర్ల లోతుంది. ఇందులోనూ సగం నీటిలో, మరో సగం భూమిపై రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్టుగా ఉంది. గొయ్యిలోని రాళ్లలో కాల్చిన బొగ్గు, సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువున్న రాళ్లు దొరికాయని చెప్పారు. కరిగిన, విరిగిన సాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ గుర్తించారు.

91 మీటర్ల ఎత్తులో సునామీ..

సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పున్న ఉల్క గంటకు 70 వేల కిలోమీటర్ల స్పీడుతో వచ్చి భూమిని ఢీకొట్టినట్టు సైంటిస్టులు అంచనా వేశారు. అంత వేగంతో ఢీకొనడంతో భారీ స్థాయిలో అగ్గి రాజుకుందని, వేలాది కిలోమీటర్ల మేర అడవి బుగ్గయిందని, 91 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చిందని చెప్పారు. ఈ సునామీ అలలు ప్రస్తుత అమెరికాలోని ఇల్లినాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు వచ్చేశాయని అన్నారు. చాలా వరకు చెత్త, శిథిలాలు గొయ్యిలోకి చేరాయని, వాతావరణంలోకి భారీ స్థాయిలో సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరి సూర్యకాంతిని అడ్డుకుందని చెప్పారు. అయితే డ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరికిన శాంపిళ్లలో సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్ప మిగతా మూలకాలు దొరకలేదని వివరించారు. ఉల్క ఢీకొన్నప్పుడే అన్ని డైనోసార్లు చావలేదని, కొన్ని నీళ్లలో మునిగి, మరికొన్ని సజీవంగా తగలబడి చనిపోతే మిగతావి తిండి దొరక్క తర్వాతి రోజుల్లో ప్రాణాలు విడిచాయని అన్నారు. మెక్సికోలో జంతువులు సునామీలు, అగ్నికి ఆహుతైతే మిగతా ప్రాంతాల్లోని జీవజాలం సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర వాయువులు వాతావరణంలో చేరి నశించాయన్నారు. చాలా మంది సైంటిస్టులు ఉల్క కొద్ది మొత్తంలోనే భూమిని, జీవులను చంపేసిందని, పెద్ద మొత్తంలో మాత్రం వాతావరణమే బలి తీసుకుందని వివరించారు.

క్రయోడ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. 32 అడుగుల రెక్కలు

ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆనవాళ్లను సైంటిస్టులు గుర్తించారు. టెరోసార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతిలో అజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డార్చిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరగతికి చెందిన ఈ పక్షికి క్రయోడ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోరియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని పేరు పెట్టారు. ఈ పక్షుల రెక్కలు సుమారు 32 అడుగుల వెడల్పు ఉండేవని, 250 కిలోల బరువుండేవని చెప్పారు. ఇవి క్రెటాసియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలానివని, సుమారు 7 కోట్ల ఏళ్లనాటి జీవులని వివరించారు. కెనడాలోని అల్బెర్టాలో 30 ఏళ్ల కిందటే ఈ పక్షుల  అవశేషాలు సైంటిస్టులు కనుగొన్నారు. రెక్కలు, కాళ్లు, మెడ, పక్కటెముకలకు సంబంధించిన ఎముకలు గుర్తించారు. కానీ అవి ఇంతకుముందున్న పక్షి జాతివేనని అప్పట్లో అనుకున్నారు. తాజాగా లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్వీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేరీ వర్సిటీకి చెందిన సైంటిస్టులు మాత్రం ఆ అవశేషాలు కొత్త జాతి పక్షివని గుర్తించారు. ఈ జంతువులు మాంసాహారులని.. చిన్న చిన్న బల్లులు, జంతువులు, చిన్న పాటి డైనోసార్లను తినేవని చెప్పారు. మహా సముద్రాలను సైతం ఇవి ఈజీగా దాటేవని భావిస్తున్నారు.