పంజాగుట్ట, వెలుగు: దివ్యాంగుల సమస్యలను ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అమలు సమితి నాయకుడు చెరుకు నాగభూషణం డిమాండ్ చేశారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు.
దివ్యాంగుల పింఛన్ పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉచిత ప్రయాణం, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల విస్తరణ అంశాలను చర్చించి అమలు చేయాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు నర్సింలు, అశోక్, వంశిరాజ్, వేణుగౌడ్, శ్రీశైలం, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
