డిగ్రీ హాస్టల్స్ మూసివేత పుకార్లను నమ్మొద్దు 

డిగ్రీ హాస్టల్స్ మూసివేత పుకార్లను నమ్మొద్దు 

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అనుబంధ కాలేజీల డిగ్రీ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఓయూ అధికారులు స్పష్టం చేశారు. ఓయూ అనుబంధ  సైఫాబాద్, నిజాం, కోఠి విమెన్స్ కాలేజీల్లోని డిగ్రీ స్టూడెంట్ల హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఓయూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ హాస్టళ్ల మూసివేత నిర్ణయం తీసుకోలేదన్నారు. హాస్టల్స్ బిల్డింగ్​లకు రిపేర్లు చేపడుతున్నామన్నారు. అవి పూర్తయిన వెంటనే స్టూడెంట్లకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు. అంతకు ముందు డిగ్రీ హాస్టల్స్​ను మూసేయొద్దంటూ ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి ఆధ్వర్యంలో  నాయకులు ఓయూలో ఆందోళన చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణకు వినతి పత్రం అందజేశారు.