సువిక్షిత్, గీతికా రతన్ జంటగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరినీ ట్యాగ్‌లైన్. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయ శంకర్ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మే 15న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 90స్‌లోని మెమరీస్‌ను గుర్తుచేసేలా సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. దూరదర్శిన్‌లో వచ్చే చిత్రలహరి కార్యక్రమం ఈ ప్రేమికులిద్దరినీ కలపడం, తర్వాత పెద్ద వాళ్ల నుంచి ఎదురయ్యే సమస్యలతో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. ‘అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. పల్లెటూరులో విహరించిన అనుభూతి కలుగుతుంది. పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి’ అని అన్నాడు. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న ఈ కథ ఎమోషనల్‌గా సాగుతుంది అని హీరో సువిక్షిత్ చెప్పాడు.
