టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ స్టైలే వేరు. మూవీ రిలీజ్ టైమ్ లోనే కాదు.. అసలు ప్రాజెక్టు సెట్స్ పైకి రాకముందే ఎలా హైప్ క్రియేట్ చేయాలో అతనికి బాగా తెలుసు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా కోసం ఒక క్రేజీ మెండ్ బ్లోయింగ్ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.
మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రీల్
సాధారణంగా ఒక కొత్త సినిమా అనౌన్స్మెంట్ అంటే ఒక పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ వదులుతారు. కానీ నవీన్ పోలిశెట్టి ఏకంగా ఇండియన్ సినిమాను శాసిస్తున్న ఐదుగురుఅగ్ర దర్శకులను ఒకే ఫ్రేమ్‌లోకి తెచ్చి సోషల్ మీడియాను షేక్ చేశాడు. ప్రశాంత్ నీల్ , లోకేష్ కనగరాజ్ , సుకుమార్ , హరీష్ శంకర్ , రిషబ్ శెట్టిలతో కలిసి నవీన్ ఒక పన్నీ రీల్‌ను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ దర్శకులందరి కెరీర్ గ్రాస్‌లను లెక్కిస్తూ.. దీనిని ఏకంగా ' రూ5,000 కోట్ల ఫ్రేమ్ ' అని, తన లైఫ్‌లోనే ఇది 'మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రీల్' అంటూ నవీన్ తన ట్రేడ్‌మార్క్ విట్‌తో పంచ్‌లు పేల్చాడు. ఈ ఐదుగురు టాప్ డైరెక్టర్లు నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్‌లో కూర్చున్నట్లు, అతనికి ఎలివేషన్లు ఇస్తున్నట్లు ఈ వీడియోను సరదాగా డిజైన్ చేశారు.
భారీ ఎంటర్‌టైనర్..
మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నవీన్ ఎనర్జీకి పక్కాగా సరిపోయే ఒక అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది ఎవరు? మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఏంటి? అనే సస్పెన్స్‌ను ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు.
►ALSO READ | Rajinikanth: 'ది ఓజీ స్వాగ్'.. ఆపరేషన్ థియేటర్‌లో రౌడీల ఊచకోత.. 'ధర్మన్'గా రజనీకాంత్ విధ్వంసం!
కేవలం ప్రమోషనల్ వీడియో కోసమే ఇంతమంది స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దించారంటే.. ఇక నెక్ట్స్ లెవల్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వెరైటీ ప్రమోషన్ చూశాక నెటిజన్లు, సినీ ప్రముఖులు.. ప్రమోషన్స్ చేయడంలో నవీన్ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Pan India reel 😍 #PrashanthNeel @aryasukku @Dir_Lokesh @shetty_rishab . @MythriOfficial here we go. New film loading soon 🔥 Super excited for next year 💪❤️🙏 pic.twitter.com/Zi5lJGS1Wy
— Naveen Polishetty (@NaveenPolishety) June 25, 2026
