Pawan Kalyan: నేను రెడీ.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ రిలీజ్.. జపాన్ మాఫియాతో ఓజస్ గంభీర ఫైట్!

Pawan Kalyan: నేను రెడీ.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ రిలీజ్.. జపాన్ మాఫియాతో ఓజస్ గంభీర ఫైట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ఓజీ ' ( OG)  సంచలనం తర్వాత.. ఇప్పుడు దానికి మించిన రేంజ్‌లో 'ఓజీ 2' (OG Universe) పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంభీర కథ సిద్ధమవుతోంది.. తుపాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది అంటూ చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైరెక్టర్ సుజీత్ కథ చెప్తుంటే, పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో 'నేను రెడీ..' అని చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

బ్లడ్ రెడ్ స్నో.. గంభీర బ్యాక్ స్టోరీ..

ఈ చిన్న వీడియోలోనే దర్శకుడు సుజీత్ పార్ట్-2 కి సంబంధించిన రెండు మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్‌ను రివీల్ చేశారు. తెల్లటి మంచు క్రమంగా రక్తం రంగులోకి (Blood Red) మారుతుండగా.. దానిపై 'ఓజస్ గంభీర' అనే పేరు రివీల్ అవుతుందట. ఈ సీన్‌తోనే పార్ట్-2 నెక్స్ట్ లెవెల్ యాక్షన్ టోన్ సెట్ కానుంది. ఈ పార్ట్‌లో ఓజస్ గంభీర పక్కన ఒక పవర్‌ఫుల్ పెట్ తోడుగా ఉండబోతోంది. అలాగే పోస్టర్‌పై ఉన్న జపనీస్ ట్యాగ్‌లైన్ 'ది మోస్ట్ ఫియర్డ్ మ్యాన్ ఇన్ ది సిటీ రిటర్న్స్' హింట్ ఇస్తున్నట్లుగా.. ఈ సీక్వెల్‌లో జపాన్ అండర్ వరల్డ్ మాఫియా కనెక్షన్స్, ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌ను చూపించబోతున్నారు.

హిస్టారికల్ టచ్.. కామిక్ బుక్ సీక్రెట్స్!

'OG: ది ఫస్ట్ బ్లడ్' కామిక్ బుక్ గ్లింప్స్ ఆధారంగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో ఓజస్ గంభీర‌కు ఉన్న అన్ టోల్డ్ కనెక్షన్‌ను కూడా ఈ సినిమాలో ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కంటిన్యూయేషన్ మాత్రమే కాకుండా.. అసలు ఓజస్ గంభీర అంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? అనే ఫ్లాష్ బ్యాక్ మిస్టరీని డార్క్ అండ్ గ్రిట్టీ టోన్‌లో సుజీత్ ప్రెసెంట్ చేయనున్నారు.

షూటింగ్ ఎప్పుడు?

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇతర సినిమా కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆయన తన రాజకీయ, అధికారిక కార్యక్రమాలను సర్దుబాటు చేసుకుని నవంబర్ తర్వాత 'OG 2' సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ లోపు సుజీత్ స్క్రిప్ట్‌ను పక్కాగా లాక్ చేసి ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేయనున్నారు. పవన్ కల్యాణ్, సుజీత్, థమన్ కాంబో మళ్లీ కలవడంతో ఈ 'OG మాస్ యూనివర్స్' ఇండియన్ సినిమాను మరోసారి రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్.