పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం

పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం

పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌ మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు అయినప్పటినుంచి ఇప్పటివరకు జిల్లా పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని చెప్పారు. జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ ఇళ్లు నిర్మించిన ప్రాంతాలు మురికి వాడలుగా ఉండేవని..TRS నిర్మించిన ప్రభుత్వ ఇళ్ల కాలనీలు గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా ఉన్నాయన్నారు. సొంత ఇల్లును ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటామో.. అంతే చిత్తశుద్ధితో ఇవాళ సకల హంగులు, అన్ని సౌకర్యాలతో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని తెలిపారు. అంతేకాదు సీఎం నాలుగు ఐటీ సెంటర్లు ప్రారంభించగానే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్నకోడూరుకు నాలుగు లైన్ల రోడ్డును మంజూరు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాలని…కోమటి చెరువు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరారు మంత్రి హరీష్.