
మొన్నటివరకు ఏపీ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికలు పూర్తవడంతో ఇకపై సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఈ నెలాఖరులో మూవీ సెట్స్‌లో పవన్ జాయిన్ అవనున్నట్టు తెలుస్తోంది. జులై చివరికల్లా తన పోర్షన్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ‘ఓజీ ఈజ్ బ్యాక్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు . తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ పదకొండేళ్ల క్రితం సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ సాధించడంతో అదే డేట్‌కు ‘ఓజీ’ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.