హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు.  కాని బోగస్, డూప్లికేట్ ఓట్లు,  మరణించిన వారి ఓట్లు కూడా హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు.

ఏపీ వారికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల వారికి కూడా రెండు ఓట్లు ఉన్నాయన్నారు. త్వరలో గ్రామ పంచాయితీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలు ఉన్నందునా ఓటర్ల లిస్టుపై, పోలింగ్ శాతంపై దృష్టి పెట్టాలని ఈసీని నిరంజన్  కోరారు.