
న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్తు కోల్పోయింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. గత 12 నెలలో కాలంలో డోప్ పరీక్షల కోసం వచ్చే అధికారులకు తన ఆచూకీ వెల్లడించడంలో మూడు సార్లు విఫలం కావడంతో ఆమెపై చర్యలు తీసుకుంది. గతేడాది ఆసియా గేమ్స్‌లో రాణించిన పర్వీన్ 57 కేజీ విభాగంలో పారిస్ ఒలింపిక్ కోటా సాధించింది. కానీ, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వాడా ఆమెను సస్పెండ్ చేసింది.
ఈ సస్పెన్షన్ ఈ నెల నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు ఉంటుందని పర్వీన్ కోచ్ సుధీర్ హుడా తెలిపారు. జులై-–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనే అవకాశం లేదు. దాంతో ఇండియా ఈ బెర్తు కోల్పోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి బ్యాంకాక్‌లో జరిగే చివరి ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో విమెన్స్ 57 కేజీ ఈవెంట్‌లో మరో బాక్సర్‌ను ఆడించి బెర్తు కోసం ప్రయత్నించాలని బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయించింది.