హిట్ లిస్ట్ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేసిన సూర్య

హిట్ లిస్ట్ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేసిన సూర్య

తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్ లిస్ట్’.  సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో  ఆర్ కె సెల్యులాయిడ్స్ బ్యానర్‌‌‌‌పై డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌‌‌‌ను హీరో సూర్య రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.  యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్‌‌‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది.

సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.  శ్రీనివాస స్క్రీన్స్,  శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.