అథ్లెట్లు డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టుబడితే కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకూ శిక్ష

అథ్లెట్లు డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టుబడితే కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకూ శిక్ష

న్యూఢిల్లీ :  అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరికట్టడానికి అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) విప్లవాత్మక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై డోప్ టెస్టులో ఫెయిలయ్యే అథ్లెట్లతో పాటు వారి కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకూ సమాన శిక్ష విధించాలని నిర్ణయించినట్టు ఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిల్లే సుమరివాలా శుక్రవారం ప్రకటించారు.  ‘దేశంలో డోపింగ్ సమస్య నియంత్రణకు మించి పోయింది కాబట్టి కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా దీనికి బాధ్యత వహించాలి. డోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టుకు హాజరయ్యే అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇకపై తమ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. దాంతో వారి కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరో  స్పష్టంగా తెలుస్తుంది. ఇది డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలోనే కాకుండా సదరు అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విజయం సాధించినప్పుడు ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ కోసం కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య కొట్లాటను కూడా నిరోధిస్తుంది’ అని పేర్కొన్నారు.