చంద్రబాబు ఇల్లు డ్రోన్ తో చిత్రీకరణ… దాడిచేసేందుకే…

చంద్రబాబు ఇల్లు డ్రోన్ తో చిత్రీకరణ… దాడిచేసేందుకే…

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటిని డ్రోన్ తో విజువల్స్ షూట్ చేసిన వారిని పట్టుకున్నారు టీడీపీ నాయకులు. చంద్రబాబుపై దాడిచేసేందుకుకే ఇంటి భద్రతను తెలుసుకునేందుకు డ్రోన్ తో చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో పాటే కరకట్టపై టీడీపీ నాయకులు బైటాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. డ్రోన్ బాక్సులో బాంబు ఉన్నట్లు వారు అనుమానించారు. తాము పట్టుకున్న వారిని పోలీసులు తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై డీజీపీ స్థాయిలో దర్యాప్తు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

డ్రోన్ తో విజువల్స్ షూట్ చేయమంది మేమే:  ఇరిగేషన్‌ డిపార్ట్ మెంట్
వరదపరిస్థితులను అంచనా వేయడంకోసమే తామే డ్రోన్ తో విజువల్స్ షూట్ చేయమన్నామని తెలిపారు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు. ఎగువనుంచి వరద మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ముంపు ప్రాంతాలపై అవగాహన కోసం తీయమన్నామని తెలిపారు.