అసోంలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు

 అసోంలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు

డ్రగ్స్ నిర్మూలన రహిత రాష్ట్రంగా అసోంను మార్చేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యువత చెడు వ్యసనాలకు లోనవ్వకుడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు రూ.192.02 కోట్ల విలువైన డ్రగ్స ను పోలీసులు ధ్వంసం చేశారు.ఇందులో రూ.31.07 కోట్ల విలువైన 6,214 కిలోల హెరాయిన్, రూ.1,751 కోట్ల విలువైన 683 కిలోల గంజాయి, రూ.16.26 కోట్ల విలువైన 271 కిలోల దగ్గు సిరప్ బాటిళ్లు, రూ.120.80 కోట్ల విలువైన 6.04 లక్షల యాబా ట్యాబ్లెట్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదేశాల మేరకు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లు కొనసాగుతాయని డీఐజీ కంగన్ జ్యోతి సైకియా తెలిపారు. కరీంగంజ్ జిల్లాలో కూడా రూ.68 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసమయ్యాయి. 3,653 కిలోల హెరాయిన్, 5.95 లక్షల యాబా టాబ్లెట్లు, 76,103 బాటిళ్ల దగ్గు సిరప్ ,పెద్ద మొత్తంలో గంజాయిని బహిరంగంగా ధ్వంసం చేసి మంటల్లో వేసి కాల్చివేశారు. అదేవిధంగా బిస్వనాథ్, హైలాకండి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ధ్వంసం చేశామన్నారు.