అండమాన్ లో వరుస భూకంపాలు..

అండమాన్ లో వరుస భూకంపాలు..

అండమాన్ దీవుల్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు...  టూరిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. ఆగస్టు 3 తెల్లవారుజామున 61 కిలోమీటర్ల లోతులో అండమాన్, నికోబార్ దీవులలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. 

2023లో ఈ దీవుల్లో సంభవించిన భూకంపాల్లో ఇది ఎనిమిదోది. ఆగస్టు 2న 5.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దీవులు దద్దరిల్లాయి. ఉదయం 5:40 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 

ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జులైలో10 కిలోమీటర్ల లోతులో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్  తెలిపింది. 

ఏప్రిల్‌లో  కాంప్‌బెల్ బేలో 4.4 తీవ్రతతో, మార్చిలో దీవుల్లోని నికోబార్ ప్రాంతంలో 5 తీవ్రతతో భూకంపం సంభవించింది.  అంతకుముందు జనవరిలో అండమాన్ సముద్రంలో తొలి భూకంపం సంభవించింది. 

4.9 తీవ్రతతో, 77 కిలోమీటర్ల లోతులో ఇది జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలా వరుస పెట్టి వస్తున్న భూకంపాలతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.