భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

భారత్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 2022 వరకు పొడిగించింది.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి భౌతిక ర్యాలీలు,రోడ్ షోలపై విధించిన నిషేధాన్ని పొడగించాలా వద్దా అనే దానిపై ఎన్నికల సంఘం ఇవాళ వర్చువల్ సమావేశాల్ని నిర్వహించింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగించింది. 

జనవరి 8న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ మరియు మణిపూర్‌లలో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఆ తర్వాత జనవరి 15 వరకు భౌతిక ర్యాలీలు, రోడ్‌లు మరియు బైక్ షోలు, ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది.  జనవరి 22 వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది.ఇవాల్టితో ఆ గడువు ముగియడంతో మరోసారి దీనిపై నిర్ణయం తీసుకుంది. అయితే, రాజకీయ పార్టీలు గరిష్టంగా 300 మంది లేదా హాల్ సామర్థ్యంలో 50 శాతం మందితో ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు సడలింపును మంజూరు చేసింది.