ఎలక్ట్రోఫోరస్ వోల్టాయి.. దీని పవర్ 850 వోల్టులు
వందల వోల్టుల కరెంట్ ఒంటికి తగిలితే ఎట్టా ఉంటది! రక్తమంతా ఆవిరైపోతది! ఇదిగో ఈ ఎలక్ట్రిక్ ఈల్ అంత పవర్ఫుల్. దీని ‘పవర్’తో ఏ ఎలక్ట్రిక్ ఈల్ సాటి రాదు. అమెజాన్ బేసిన్లో ఎక్కువగా ఉండే ఈ ఈల్ ఒంటి నిండా 860 వోల్టుల కరెంట్‌ను నింపుకుంటుందట. మామూలుగా అయితే, ఓ ఎలక్ట్రిక్ ఈల్ పవర్ 650 వోల్టులుంటుందని సైంటిస్టులు అంటున్నారు. స్మిత్సోనియన్కు చెందిన నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ సైంటిస్టులు ఇంత పవర్ ఉన్న రెండుఎలక్ట్రిక్ ఈల్స్ జాతులను గుర్తించారు. అందులో ఒక దాని పేరు ఎలక్ట్రోఫోరస్ వోల్టాయి. మామూలు ఎలక్ట్రిక్ ఈల్స్ అయిన ఎలక్ట్రోఫోరస్ ఎలక్ట్రికస్తో పోలిస్తే వీటి శక్తి చాలా చాలా ఎక్కువ. నిజానికి ఇవి మామూలు చేపల్లాంటివే. కాకపోతే వాటి ఆకారం ఈల్స్‌ను పోలి ఉండడంతో అలా పిలుస్తుంటారు.
ఒక్కోటి 8 అడుగుల వరకు పెరుగుతుంది. ఎక్కువగా అమెజాన్ వర్షారణ్యాల్లోనే కనిపిస్తుంది. 250 ఏళ్లలో ఇంత పవర్ఫుల్ ఈల్‌ను గుర్తించడమంటే, అమెజాన్ బేసిన్లో ఇలాంటివి మరిన్ని ఉండి ఉంటాయన్న దానికి నిదర్శనమని లీడ్ సైంటిస్ట్ డేవిడ్ డి సాంటానా చెప్పారు. కొత్తగా కనుగొన్న రెండు ఈల్స్ జాతులతో కలిపి ఇప్పుడు మూడయ్యాయి. అయితే, ఆ మూడు రకాల ఈల్స్ జన్యువుల్లో తేడాలున్నట్టు గుర్తించారు సైంటిస్టులు. వాటి తలలు, ఆకారం, వాటి పవర్ అన్నింట్లోనూ తేడాలున్నట్టు తేల్చారు. ఈ మూడు జాతులు కూడా 71 లక్షల ఏళ్ల క్రితం ఓ ఎలక్ట్రిక్ఈల్స్ జాతి నుంచే పుట్టాయని భావిస్తున్నారు. అయితే, తేట నీళ్లలో కరెంట్ ప్రసరించదు కాబట్టి, దానికి తగ్గట్టు అవి పవర్‌తో ఉంటున్నాయని అనుకుంటున్నారు.
ఒక బ్యాటరీని కనిపెట్టడానికి ఈ ఈల్స్నే సైంటిస్టులు స్ఫూర్తిగా తీసుకున్నారంటే నమ్ముతారా? 1799లో సైంటిస్టులు వీటి ఆధారంగానే బ్యాటరీలను రూపొందించారంటున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వాటిలోని పవర్ ఆధారంగా జబ్బులకు చికిత్స చేయడంలోనూ కొత్త పద్ధతులను కనుక్కోవచ్చని భావిస్తున్నారు. ఈల్స్లో రకరకాల ఎంజైములు, రకరకాల కాంపౌండ్లు ఉంటాయని, వాటితో మందులు తయారు చేయొచ్చని, అవసరమైతే కొత్త టెక్నాలజీలనూ తయారు చేయొచ్చని వేడివ్ డి సాంటానా అన్నారు.
