న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మార్చి 30) రాజ్య సభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ప్లాఫ్ అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపమే కారణమని ఆరోపించారు. ప్రాజెక్ట్ లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా గంగాలో పోశారని విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలన్ని బీఆర్ఎస్ ఎంపీని.. ప్రాజెక్ట్ కట్టిన మూడేళ్లలోనే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలను నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించిందని గుర్తు చేశారు.
