IPL 2026: ధోనీ, బ్రేవిస్ లేని CSK.. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ భారం మొత్తం వారిపైనే

IPL 2026: ధోనీ, బ్రేవిస్ లేని CSK.. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ భారం మొత్తం వారిపైనే

IPL 2026: ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. సీఎస్కేకు అండగా ఉన్నట్టు వంటి మహేంద్ర సింగ్ ధోని రెండు వారాలు దూరం కావడంతో పాటు డ్యాషింగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్ సైతం కొన్ని మ్యాచుల్లో ఆడటం లేదని తెలియడంతో చెన్నై ఫ్యాన్స్ లో కలవరం స్టార్ట్ అయింది. ఇద్దరూ హార్డ్ హిట్టర్లు.. ధోని ఆఖర్లో వచ్చి దూకుడుగా ఆడతాడు.. ఇక బ్రెవిస్ అయితే తొలి బంతి నుంచే ఎలా విరుచుకుపడతాడో గత టీ20 ప్రపంచ కప్ లో అందరం చూశాం.. ఇప్పుడు వీరిద్దరూ లేకపోవడంతో సూపర్ కింగ్స్ భారమంతా ఎవరిపైనా పడుతుందో తెలుసుకుందాం పదండి. 

మిడిలార్డర్లో వీరిపై భారం: 
కెప్టెన్ రుతురాజ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా స్టార్ట్ అయి స్పీడ్ అందుకుంటాడు. సంజుశాంసన్ మాత్రం రాకెట్ వేగంతో ప్రారంభించి.. అదే వేగంతో క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈసారి వీరిద్దరూ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వన్ డౌన్ లో సర్ఫరాజ్ ఖాన్ లేదా ఆయుష్ మాత్రేను ఆడించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మాథ్యూ షార్ట్ రూపంలో వేగంగా ఆడే ప్లేయర్ ఉన్నాడు. ఉర్విల్ పటేల్ ని తక్కువగా అంచనా వేయలేం.. వికెట్ కీపర్/ బ్యాటర్ కార్తిక్ శర్మ కొత్త కుర్రాడు. అతడిని సీఎస్కే రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. మరో ప్లేయర్ ప్రశాంత్ వీర్ కి ఇదే మొత్తంలో వెచ్చించింది. అతడు ఆల్ రౌండర్.

లోయర్ ఆర్డర్ భారం: 
ఐపీఎల్ లో లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉంటేనే ఆ జట్టు సమతూకంగా ఉన్నట్లు చెబుతాం.. ధోని జట్టులో ఉంటే సీఎస్కే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, అతడు రెండు వారాలు జట్టుకి దూరం కావడంతో.. ఇప్పుడు లోయర్ ఆర్డర్ భారం మొత్తం శివమ్ దూబె పైనే పడింది. 6వ స్థానంలో వచ్చి స్పీడ్ గా పరుగులు రాబట్టే దూబెకు సహకారం ఇచ్చేవాళ్లు సీఎస్కేకు కీలకం కాబోతున్నారు. అన్షుల్ కాంబోజ్ కి ఈ టాలెంట్ ఉంది.. గతంలోనూ అనేకసార్లు చివర్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన అనుభవం అతడికి ఉంది. 

వాళ్లని కట్టుడి చేయాలి: 
బౌలింగ్ విషయానికొస్తే సీఎస్కే మెరుగ్గానే కనిపిస్తుంది. మ్యాట్ హెన్రీ, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తో కూడిన బౌలింగ్ విభాగం ఫర్వాలేదనిపిస్తుంది. కానీ రాజస్థాన్ జట్టులో హిట్టర్లకు కొదవలేదు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మయెర్ దూకుడుగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. వీళ్లను అడ్డుకోవాలంటే ప్రధాన స్పిన్నర్లు నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ కీ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది.

తుది జట్టు: 
సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్/ఉర్విల్ పటేల్, మాథ్యూ షార్ట్, శివమ్ దూబె, అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్