IPL 2026: CSK vs RR మ్యాచ్ జరిగేనా!.. గౌహతిలో భారీ వర్షం 

IPL 2026: CSK vs RR మ్యాచ్ జరిగేనా!.. గౌహతిలో భారీ వర్షం 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ( 2026, మార్చి 30) మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం ప్రారంభమైంది. పిచ్ ని, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కాసేపట్లో జరగాల్సిన మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం కేవలం 20 శాతంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే వర్షం మొదలు కావడంతో టాప్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ మూడు హోం మ్యాచులని గౌహతిలో ఆడనుంది. ఒకవేళా ఈ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేసే అవకాశం క్లియర్ గా ఉంది. 

కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని తెలుస్తుంది. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం సెట్ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు జట్ల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.