V6 News

ఎలక్ట్రిక్ వెహికిల్‌ కొంటే.. రూ.50వేల రిబేట్‌

ఎలక్ట్రిక్ వెహికిల్‌ కొంటే..  రూ.50వేల రిబేట్‌

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు రకాల చర్యలను తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలుపై రూ.50వేల వరకు రిబేట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. వీరిని ‘ప్రియారిటీ సెక్టార్ లెండింగ్’ కిందకు తీసుకొచ్చి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇవ్వాలనుకుంటున్నట్టు  ఓ అధికారి తెలిపారు. ఇది ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ తయారీని, అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఒక భాగమని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలనే ఉంచాలనుకుంటోంది.

దీనికోసం ప్రత్యేకంగా ఒక కేబినెట్‌ నోటు తయారు చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం ఇంజిన్లతో నడుస్తున్న వాహనాల ధరలకు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు సమానంగా ఉండేలా ప్రభుత్వం ఈ ప్రోత్సహకాలను అందిస్తోంది.  వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, మొదటగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కే ప్రాధాన్యమిచ్చేలా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో ఈ ప్లాన్‌‌ను ఎంపిక చేసిన నగరాల్లో ఒక నిర్దేశిత కాలానికి ప్రారంభించనున్నారు. ఈ ప్రోత్సహకాలు  బ్యాటరీ పరిమాణం, వెహికిల్ మోడల్‌‌ను బట్టి ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సరియైన

ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించడం కోసం విస్తృతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమని అధికారి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు గణనీయమైన పొదుపును అందించే క్రమంలో భాగంగా వాటికి పార్కింగ్ ఛార్జీలను పూర్తిగా.. కొంత మేర తగ్గించనున్నట్టు అధికారి చెప్పారు. రాష్ట్రాల రోడ్డు, రిజిస్ట్రేషన్ పన్నులను రద్దు చేయనున్నట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు దిగుమతి చేసుకునే ముడి సరుకుకు ప్రభుత్వం ఇప్పటి కే డ్యూటీలను తగ్గించింది.