US ఓపెన్ ఫైనల్లోకి బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా

US ఓపెన్ ఫైనల్లోకి బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో అతిపెద్ద సంచలనం నమోదైంది. బ్రిటన్ టీనేజి టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా రడుకాను ఫైనల్లోకి దూసుకెళ్లింది. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఓపెన్ చరిత్రలో ఒక క్వాలిఫయర్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరడం ఇదే ఫస్ట్ టైం. అంతేకాదు,.. గత 17 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన అత్యంత పిన్నవయస్కురాలు ఎమ్మానే.

18 ఏళ్ల ఎమ్మా  ఇవాళ జరిగిన సెమీఫైనల్లో 17వ సీడ్ గ్రీస్ ప్లేయర్ మారియా సకారీపై 6-1, 6-4తో అద్భుత విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం 150వ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా..యూస్ ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి లేలా ఫెర్నాండెజ్‌(19)తో తలపడనుంది.