మట్టి గణేశ్ విగ్రహాలను ప్రోత్సహించండి

మట్టి గణేశ్ విగ్రహాలను ప్రోత్సహించండి
  • మట్టి గణేశ్ విగ్రహాలను ప్రోత్సహించండి
  • హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే : సీఎస్​

హైదరాబాద్,  వెలుగు: రాష్ట్రంలో మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని అధికారులను సీఎస్​ సోమేశ్​కుమార్ ఆదేశించారు. సెప్టెంబర్ లో జరగనున్న గణేశ్​ నిమజ్జనంపై బీఆర్కే భవన్​లో సీఎస్​ మంగళవారం రివ్యూ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే కెమికల్స్ తో గణేశ్ విగ్రహాలు  తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని వివరించారు. విగ్రహాల తయారీదార్లను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు.  ఈసారి ​ విగ్రహాలను  హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదని తెలిపారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, స్సెషల్​ సీఎస్ ​అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆనంద్, మహేశ్​ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ తదితరులు పాల్గొన్నారు.