పెరుగుతున్న కేసులు.. పంజాబ్‌లో కొత్త లాక్‌డౌన్ నిబంధనలు

పెరుగుతున్న కేసులు.. పంజాబ్‌లో కొత్త లాక్‌డౌన్ నిబంధనలు

చండీగఢ్: కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పంజాబ్ సర్కార్ కొత్త లాక్‌డౌన్‌ నిబంధనలను రూపొందించింది. రాష్ట్రంలో రాత్రి 7 నుంచి పొద్దున 5 గంటల వరకు ప్రతి రోజు కర్ఫ్యూను విధించింది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అములులోకి రానుంది. అలాగే రాష్ట్రంలోని 167 సిటీలు, టౌన్స్‌లో వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేయనుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని సర్కార్ తెలిపింది. పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ పైనా పలు అమరిందర్ సింగ్ ప్రభుత్వం కొన్ని నిషేధాలు విధించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలను మినహాయిస్తే ఎక్కడా కూడా ప్రజలు గుమిగూడొద్దని బ్యాన్ వేసింది.

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఐదు జిల్లాల్లో 50 శాతం షాప్స్‌ను మూసేయాలని నిర్ణయించింది. ‘అయిపోయిందేదో అయిపోయింది. రాష్ట్ర ఎకానమీపై ప్రభావం పడకుండా మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మరణాలు నన్ను బాధ పెడుతున్నాయి. రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అత్యవసరంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నాం’ అని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చెప్పారు. పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య 36 వేలకు చేరుకుంది. మహమ్మారి బారిన పడి 900 మంది మృతి చెందారు. ప్రస్తుతం 12 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.