దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ స్టాక్ చాలానే ఉంది: కేంద్రం

దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్  స్టాక్ చాలానే ఉంది: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ స్టాక్ కావాల్సినంత ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మెడిసిన్ డిమాండ్, లభ్యత, ప్రొడక్షన్ ను రోజువారీ ట్రాక్ చేస్తున్నామని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్ పీపీఏ) చైర్మన్ శుభ్రసింగ్ శుక్రవారం చెప్పారు. “క్లోరోక్విన్ ను దేశ అవసరాల కోసం అందుబాటులో ఉంచడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇక్కడ డిమాండ్ కు సరిపడిన తర్వాతే ఎగుమతి చేస్తాం” అని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశంలో హైడ్రాక్సీ క్లోరో క్విన్ తయారీకి అవసరమైన ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రెడియెంట్స్ 40 టన్నులు ఉన్నాయని, వాటితో 200 మిల్లీగ్రాముల 20 కోట్ల ట్యాబ్లెట్లు తయారు చేయవచ్చని ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) తెలిపింది. ప్రస్తుత డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, అవసరమైతే ఉత్పత్తి వేగం పెంచుతామని చెప్పింది. ప్రపంచంలో 70 శాతం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను మనదేశమే ఉత్పత్తి చేస్తోంది. ఐపీసీఏ, జిడస్ కాడిలా లాంటి కంపెనీలు ఈ మెడిసిన్ ను తయారు చేస్తున్నాయి. కరోనా ట్రీట్ మెంట్ కోసం వివిధ దేశాలు హైడ్రాక్సీక్లోరో క్విన్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎగుమతిపై ఉన్న బ్యాన్ ను పాక్షికంగా ఎత్తివేసింది.