విక్టరీ వెంకటేశ్ బర్త్‌ డే‌ గిప్ట్.. ఎఫ్3 పోస్టర్ రిలీజ్

విక్టరీ వెంకటేశ్ బర్త్‌ డే‌ గిప్ట్.. ఎఫ్3 పోస్టర్ రిలీజ్

హైద‌రాబాద్‌: వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్2. అనిల్ రావిపుడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంత పెద్ద‌ హిట్ అయిందో అందరికి తెలుసు. అత్యంత ప్రేక్షకాద‌ర‌ణ పొందిన‌ ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైంది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 నిర్మిస్తున్నారు నిర్మాత‌ దిల్ రాజు. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ హీరోలుగా రూపుదిద్దుకుంటోన్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆదివారం వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు తీసుకెళ్తూ క‌నిపిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఏరేంజ్‌లో ఫన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తారనేది వేచి చూడాలి.