ఉద్యోగం కోసం పెళ్లి డ్రామా.. అడ్డంగా బుక్కయ్యారు

ఉద్యోగం కోసం  పెళ్లి డ్రామా.. అడ్డంగా బుక్కయ్యారు

రంగారెడ్డి జిల్లా: ఉద్యోగం కోసం ఏకంగా పెళ్లి డ్రామా ఆడారు అడ్డంగా బుక్కయ్యారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని లాల్ సింగ్ తండాలో అంగన్ వాడి పోస్ట్ కోసం అదే తండాకు చెందిన నరేష్ (17) సంవత్సరాలు మరో తండాకు  చెందిన కవిత అనే అమ్మాయితో వివాహం అయినట్టు ఫరూక్ నగర్ మండల తహసిల్దార్ పాండు తేదీ 16 /9/2020నాడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు తేదీ 30/9/2020 నాడు వాలిద్దరికి వివాహం కాలేదని  షాద్ నగర్ ఆర్డీఓకు  లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసారు. దీంతో  తేదీ 1/10/2020/ నాడు తహసిల్దార్ మళ్ళీ దాన్ని క్యాన్సలేషన్ చేసి ఇచ్చాడు. అన్ని పరిశీలించాల్సిన అధికారులు… గుడ్డిగా సంతకాలు చేయడంతో తహసిల్దార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.