నకిలీ శానిటైజర్లు ..క్వాలిటీ లేని కిట్లు

నకిలీ శానిటైజర్లు ..క్వాలిటీ లేని కిట్లు

సిటీ మార్కెట్ ను ముంచెత్తుతున్న నాసిరకం సరుకు
చూసి వాడకపోతే డేంజర్ అంటున్న ఎక్స్ పర్స్ట్
80శాతం ఇథనాల్ ఉంటేనే మంచి శానిటైజర్
మిథనాల్ వాడిన వాటితో హెల్త్ కు ముప్పు
నాసిరకం మెటీరియల్ తో పీపీఈ కిట్స్
పట్టించుకోని అధికారులు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తితో శానిటైజర్లు, పీపీఈ కిట్లకు ప్రయారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు అనుమతులు, అవగాహన లేకున్నా అనేక మంది తయారీ మొదలుపెడుతున్నారు. డబ్య్లూహెచ్ ఓ గైడ్ లైన్స్ ప్రకారం డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ తో సేల్ చేయాల్సిన శానిటైజర్లు ఇప్పుడు రోడ్ల మీద కూడా అమ్ముతున్నారు. వాటిల్లో మిథనాల్ కలవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎక్స్ ప‌ర్ట్స్ చెప్తున్నారు. పీపీఈ కిట్లను కూడా నాసిరకం ఫ్యాబ్రిక్ తో తయారు చేసి మార్కెట్లోకి వదులుతుండడం ఆందోళన కలిగించే విషయం.

లైసెన్స్డ్ కంపెనీలవి అయితే..

శానిటైజరలో్ల ఐఎస్ఓ ప్రొపైల్ ఆల్కహాల్ ఉన్నవి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే, ధర ఎక్కువ. లిక్కర్ మానుఫ్యాక్చరింగ్ తో ఉపయోగించే ఇథనాల్ కంటెంట్ 80 శాతంపైన ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ ప‌ర్మిషన్ తో, ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అవుతుంటాయి. మానుఫ్యాక్చర్ గ‌వ‌ర్నమెంట్ అప్రూవల్ ల్యాబ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.

సిటీ వ్యాప్తంగా శానిటైజర్స్

మాను ఫ్యాక్చరర్స్ 50 నుంచి 70 మంది దాకా ఉన్నారు. కంటెంట్ పర్సంటేజీల్లో తేడా.. ఏది టచ్ చేసినా, చేయాలన్నా చేతులు శానిటైజ్ చేసుకోవాల్సి వస్తోంది. వాటి డిమాండ్ గుర్తించిన అనేక మంది లైసెన్స్ లేకుండానే శానిటైజర్లు తయారు చేస్తున్నారు. ఇథనాల్ కు బదులు కెమికల్ ఫ్యాక్ట‌రీ్ల్లో వాడే మిథనా ల్యూజ్ చేస్తున్నారు. కేంద్రం గైడ్‌‌‌‌లైన్స్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ ప‌ర్మిషన్ లేకున్నా అమ్ముకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.ఇథనాల్ కంటే 60 శాతం ఉంటే మిథనాల్ 20 శాతం ఉంటోంది. కొద్దిమంది హైడ్రోజన్ పెరాక సై్డ్ ఎక్కువగా కలుపుతున్నారు. హైడ్రోజన్ పెరాక సై్డ్ అధిక మోతాదులోవాడితే స్కిన్ ఇరిటేషన్, చేతిపై బొబ్బలు, ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది.

క్వాలిటీ లేని పీపీఈ కిట్స్..

కరోనా పేషెంట్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ల‌తో పాటు చాలామంది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం పీపీఈ కిట్స్ యూజ్ చేస్తున్నారు. వాటిని సిత్రా (సౌత్ ఇండియన్ టెక్స్ టైల్ రీసెర్చ్ అసోసియేషన్) అప్రూవ్ చేసి మెటీరియల్ తోనే తయారు చేయాల్సి ఉంది. 90 శాతం  జీఎస్ఎం థిక్ నెస్ ఫ్యాబ్రిక్ తో చేసినవే క్వాలిటీగా ఉంటాయి. అందులోనూ లామినేటెడ్, నాన్ లామినే టెడ్ రకాలుంటాయి. లామినేటెడ్ లో ప్లాస్టి క్ కోటెడ్ ఉంటుంది. ఇది మాత్రమే యూజ్ చేయాలి. ప్లాస్టిక్ కోటెడ్ ఉండటం వల్ల ఫ్లూయడ్స్, వైరస్ లోపలికి వెళ్ల‌దు. పీపీఈ కిట్స్ చేసేవారు కూడా ఫుల్ ప్రొటెక్షన్ తో, జాగ్రత్తలు పాటిస్తూ కుడతారు. నాన్ ఓవెన్ దారంతో స్టిచ్చేసినతర్వాత దారం రంధ్రాల్లో నుంచి కూడా వైరస్ వెళ్ల‌కుండా టేప్ వేస్తారు. పూర్తయిన కిట్స్ ని ఈటీఓ స్టైరిలైజేషన్ రూమ్ లో స్టోర్ చేస్తారు. కాగా, చాలా మంది నార్మల్ ఫ్యాబ్రిక్, 60జీఎస్ఎం థిక్ నెస్ తో చేసి అమ్ముతున్నారు. అధికారుల నిఘా ఉండకపోవడంతో క్వాలిటీ లేని శానిటైజర్స్, పీపీఈ కిట్లను మార్కెట్లోకి విపరీతంగా వదులుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..