ఆర్టికల్ 35-A ను కెలకొద్దు: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం

ఆర్టికల్ 35-A ను కెలకొద్దు: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం

ఆర్టికల్ 35-Aను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆర్టికల్ 35-A ను కెలకొద్దని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ముఫ్తీ సూచించారు. 35-Aను టచ్ చేయడమంటే… నిప్పుతో ఆడుకోవడమేనని ఆమె హెచ్చరించారు. దానిని టచ్ చేస్తే బూడిదైపోతారన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 35-A  జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకాధికారాలు కల్పిస్తోంది. దానిని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. అందుకోసమే ఆ రాష్ట్రానికి 10వేల అదనపు బలగాలను పంపిందని ఆ రాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పెద్ద ఉగ్రదాడి జరగనున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కు అదనపు బలగాలు పంపామని కేంద్రం వివరణ ఇచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని కేంద్రం తెలిపింది