ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి
  • మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేడీఎస్​తో పొత్తు పెట్టుకోవడంతోనే రేవణ్ణను అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ మౌనంగా ఉంటోందని తెలిపారు. ‘మోదీ హఠావో దేశ్ కో బచావో’ అంటూ నినదించారు. గతేడాదే ఈ విషయం తెలిసినప్పటికీ  జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందని సునీతరావు విమర్శించారు.