పురుగుల మందు తాగిన ఐదో క్లాస్​ స్టూడెంట్​

పురుగుల మందు తాగిన ఐదో క్లాస్​ స్టూడెంట్​

రేగొండ, వెలుగు: డీటీహెచ్ రీచార్జ్​ చేయించలేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదో క్లాస్​ స్టూడెంట్​పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుర్రం మణికుమార్(10) నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటున్నాడు. స్థానిక స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9న టీవీ రావట్లేదని, రీచార్జ్​చేయించమని మణికుమార్​నాయనమ్మని అడిగాడు. ఆ విషయంలో బాలుడిని ఆమె మందలించింది. దీంతో బాధపడిన మణి అదే రోజు ఇంట్లోని పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.

కొడుకులు పట్టించుకోవట్లేదని తండ్రి..
శంషాబాద్: కొడుకులు పట్టించుకోవట్లేదని హైదరాబాద్​లో ఓ తండ్రి పురుగల మందు తాగి చనిపోయాడు. రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని అత్తాపూర్​ గుమ్మకొండ కాలనీకి చెందిన రాంబాబు(60), వెంకటరత్నంకు ఇద్దరు కొడుకులు. గతేడాది వరకు అంతా కలిసే ఉన్నారు. కరోనా ఫస్ట్‌‌‌‌ వేవ్ అప్పుడు రాంబాబు కొంత అనారోగ్యానికి గురయ్యాడు. అదే టైంలో కొడుకులు వేరు కాపురాలు పెట్టారు. అప్పటి నుంచి వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ఏదైనా పనిచేసి కడుపు నింపుకుందామంటే అనారోగ్యం, వృద్ధాప్యం అడ్డుపడుతుండడంతో మానసికంగా కుంగిపోయారు. ఆదివారం రాత్రి భార్య ఇంట్లో లేనిటైంలో రాంబాబు కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్​చేసి చెప్పారు. డెడ్‌‌‌‌బాడీని పోస్టుమార్టంకు తరలించి కేసు ఫైల్​చేసినట్లు సీఐ తెలిపారు.