ఫైర్ సిబ్బంది రియల్ హీరోలు

ఫైర్ సిబ్బంది రియల్ హీరోలు
  • సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

సికింద్రాబాద్​,వెలుగు: ప్రాణాలను లెక్క చేయకుండా ప్రమాదాల్లో ఉన్న జనాల ప్రాణాలను, ఆస్తులు కాపాడే అగ్నిమాపక సిబ్బందే రియల్​ హీరోలని సినీ డైరెక్టర్​శేఖర్​ కమ్ముల పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్​లోని ఫైర్​స్టేషన్​లో జేసీఐ హైదరాబాద్​ దక్కన్,  అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో  అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా బ్లడ్​ క్యాంప్​ ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్​కమ్ముల మాట్లాడుతూ  ఎన్నో సార్లు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడం దగ్గరగా చూశానన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వాహనదారులు , అంబులెన్స్​లకు దారి ఇచ్చినట్లుగానే ఫైరింజన్లకూ ఇవ్వాలని ఆయన సూచించారు. 
చిన్నారులకు ఫైర్​సేఫ్టీపై అవగాహన కల్పించాలన్నారు.  జనాల్లో అవగాహన కల్పించేందుకు సినీ నటులతో మెసేజ్​లు ఇప్పిస్తామని,సెలబ్రిటీలు చెపితే జనాలు బాగా వింటారన్నారు.  అనంతరం అగ్ని మాపక శాఖలో సమర్ధంగా డ్యూటీలు చేసిన సిబ్బందికి మెమోంటోలు అందించారు. స్కైలిఫ్ట్​ వాహనాన్ని ఎక్కి దాని  పనితీరు గురించి అధికారులను అడిగారు. సికింద్రాబాద్​ ఫైర్ ​ఆఫీసర్​  మోహన్​రావు, జేసీఐ  అధ్యక్షుడు సందీప్ సర్దా, ప్రతినిధులు సుధీర్,అమిత్,మోనల్, విజయ్ పాల్గొన్నారు.
గండిపేట: ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి టి.పూర్ణచందర్‌‌ సూచించారు.  రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను  రాజేంద్రనగర్‌‌లో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.