హైదరాబాద్ లో తొలి సైక్లింగ్ పార్క్.. మే 7న ప్రారంభం

హైదరాబాద్ లో  తొలి సైక్లింగ్ పార్క్.. మే 7న ప్రారంభం

హైదరాబాద్ లో తొలి సైక్లింగ్ పార్క్  మే 7 వ తేది నుంచి అందుబాటులోకి రానుంది.  కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ కు ఎదురుగా  ఏర్పాటు చేసిన పాలపిట్ల సైక్లింగ్ పార్క్ ను తెలంగాణ అటవిశాఖ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ప్రారభించనున్నారు.

 హైదరాబాద్ బైసైక్లింగ్  క్లబ్ ప్రతినిధులు  అటవిశాఖకు చెందిన 47 ఎకరాల్లో  సైకిల్ తొక్కేందుకు వీలుగా 3 కి.మీ. ట్రాక్ ను రెడీ చేశారు. రాష్ట్రంలోనే  ఇది తొలిసైక్లింగ్ పార్క్ . సైకిల్ తొక్కాలనుకునే వారు  ఈ పార్క్ కు రావొచ్చు.   

హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ పై అవగాహన కల్పించేందుకే ఈ సైక్లింగ్ పార్క్ ను అందుబాటులోకి తెచ్చినట్లు క్లబ్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. దాదాపు 500 మంది సైకిల్ తొక్కుకునేందుకు వీలుగా ట్రాక్ ఉందన్నారు. ఎంట్రీ ఫీజు  గంటకు రూ.50, నెలకు రూ. 800 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.