ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత

ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత

ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వీ6, వెలుగుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నరు? అని అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ ఈ సమాధానం ఇచ్చారు.

 "ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన. జయశంకర్​ సార్​ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్​ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్​, ఈనాడు బీఆర్​ఎస్​ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్​ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకుండు. అధికారం చేపట్టిండు. ఆస్తులు సంపాదించుకుండు. 

కేసీయారే చెప్పిండు.. బీఆర్​ఎస్​ పక్కా పొలిటికల్​ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్​నని. కేసీఆర్​కు, తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీల లాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన​ చేసిన పనికి, వచ్చిన కూలి చాలా ఎక్కువ. కేసీఆర్​ ఒక్కడు వంద తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్​ జయశంకరే.. ఎవరికీ అనుమానం అక్కర్లేదు" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.