పరిగి, వెలుగు: లక్నాపూర్ ప్రాజెక్ట్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాలకు తన సతీమణి ఉమారెడ్డితో కలిసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
వికారాబాద్ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పేరొందిన లక్నాపూర్ ను అంచెలంచెలుగా డెవలప్ చేస్తామన్నారు. ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని చీరల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ చేశారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాంరెడ్డి, వైస్ చెర్మన్ అయూబ్ పాల్గొన్నారు.
