కంటోన్మెంట్, వెలుగు: బొల్లారంలో శుక్రవారం రాష్ట్రపతి పర్యటన ఉండగా.. అదే ప్రాంతంలో యాక్సిడెంట్ జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పర్యటన రోజున జరిగిన లారీ కారు యాక్సిడెంట్ వల్ల ఒక్కసారిగా అలజడి నెలకొంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆమె పర్యటన కొద్దిసేపట్లో ఉండగా.. అదే సమయంలో బొల్లారం వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో దానిని తొలగించి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.
