సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం (నవంబర్ 21) జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ లక్ష్య 23–21, 21–11తో తోటి ప్లేయర్ ఆయుష్ షెట్టిపై నెగ్గాడు. 52 నిమిషాల మ్యాచ్‌లో ఆయుష్ 9–6తో తొలి గేమ్‌ను మొదలుపెట్టాడు. కానీ మధ్యలో లక్ష్య కొట్టిన క్రాస్ కోర్టు విన్నర్లను తీయలేక ఇబ్బందిపడ్డాడు.
దాంతో సేన్11–10, 19–17తో ముందుకెళ్లాడు. మళ్లీ పుంజుకున్న ఆయుష్ తొలి గేమ్ పాయింట్‌ను సాధించే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తిగా లక్ష్య ఆధిపత్యమే నడిచింది. మెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ షెట్టి 19–21, 15–21తో ఫజర్ అల్ఫియాన్–మహ్ముద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) చేతిలో ఓడారు.
