T20 World Cup: కొట్టాలి తీన్ మీర్.. ఇవాళ్టి (ఫిబ్రవరి7) నుంచే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌

T20 World Cup:  కొట్టాలి తీన్ మీర్.. ఇవాళ్టి (ఫిబ్రవరి7)  నుంచే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌
  • బరిలో 20 జట్లు.. ఇండియా, శ్రీలంకలో పోటీలు
  • సొంతగడ్డపై హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టీమిండియా

క్రికెట్ అంటేనే కిక్కు.. అందులోనూ టీ20 వరల్డ్ కప్ అంటే నరనరాల్లో ఉత్కంఠ!  ఇలాంటి మెగా టోర్నీల్లో మైదానంలో పరుగుల వరద, గ్యాలరీలో అభిమానుల కేరింతలు కామన్. కానీ, ఈసారి ఇండియా వేదికగా జరుగుతున్న ఈ సమరం కాస్త వెరైటీ!

బంతి పడకముందే రాజకీయాలు పడగవిప్పాయి. ఇండియాలో ఆడనన్న బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేటు పడటం..దాయాది పాకిస్తాన్ బాయ్‌‌‌‌కాట్ రాగం అందుకోవడంతో టోర్నీ ముంగిట  ఆటేతర రచ్చే హైలైట్ అయ్యింది.ఇప్పుడు ఆ గోలకు ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్ పెట్టి, అసలు సిసలు మజాను పంచే క్షణం ఆసన్నమైంది. నేటి నుంచే షార్ట్ ఫార్మాట్ వరల్డ్ వార్ షురూ కానుంది! సరిహద్దులు దాటి వచ్చిన 20 జట్లు, కప్పు కోసం అమీతుమీ తేల్చుకునేందుకు కత్తులు దూస్తున్నాయి. బౌండరీ లైన్ అవతల రాజకీయాలు ఏవైనా సరే.. లైన్ లోపల మాత్రం ఫోర్లు, సిక్సర్ల సునామీ సృష్టించేందుకు  రెడీ అయ్యాయి. ల రోజుల పాటు 55 మ్యాచ్‌‌‌‌ల్లో ఇక సందడే సందడి! ఈ మెగా టోర్నీలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఏ ఆతిథ్య దేశమూ సొంతగడ్డపై కప్పు కొట్టలేదు. అలాగే ఏ డిఫెండింగ్ చాంపియన్ కూడా వరుసగా రెండోసారి టైటిల్ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా  టార్గెట్ ఆ రెండు సెంటిమెంట్ రికార్డులను బద్దలు కొట్టడమే! పొరుగు దేశాల కుతంత్రాలను బౌండరీ అవతలికి విసిరేసి.. మెగా టోర్నీలో మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ముచ్చటగా మూడోసారి ఈ కప్పును ముద్దాడి, సరికొత్త చరిత్ర లిఖించేందుకు టీమిండియా కసిగా ఉంది.ఏ ఆటలో అయినా సొంతగడ్డపై వరల్డ్ కప్ నెగ్గితే వచ్చే మజాయే వేరు!  గతేడాది మన అమ్మాయిలు వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అబ్బాయిలు అదే హిస్టరీని రిపీట్ చేయాలని  వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. నెల రోజుల పాటు సాగే ఈ చిట్టి కప్పు అందించే గట్టి మజాను ఆస్వాదించేందుకు సిద్ధమైపోదాం!

 ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిట్టి క్రికెట్ మహా సంగ్రామం... ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్ పదో ఎడిషన్ రానే వచ్చేసింది. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఇండియాతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శనివారం ప్రారంభం  కాబోతోంది. గతానికి భిన్నంగా ఈసారి మైదానంలో ఆట కంటే, మైదానం బయట జరుగుతున్న రాజకీయ పరిణామాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన మెగా టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా టైటిల్ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. తొలి రోజే మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీ20 మజా లభించనుంది. కొలంబోలో ఉదయం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నెదర్లాండ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. మధ్యాహ్నం కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–స్కాట్లాండ్ ఢీకొంటాయి. రాత్రి ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా–అమెరికా మధ్య పోరుతో టోర్నీకి అసలైన ఆరంభం లభించనుంది. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాటే కొనసాగనుంది. 20 జట్లు ఐదేసి చొప్పున నాలుగు గ్రూపుల్లో బరిలోకి దిగుతాయి. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ప్రతీ టీమ్ మిగిలిన నాలుగింటితో ఒక్కో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో నిలిచిన రెండు జట్లు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయి నాలుగేసి చొప్పున రెండు గ్రూపుల్లో తలపడతాయి. అందులో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. ఇండియాలోని ఐదు నగరాలు (ముంబై, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ), శ్రీలంకలోని కొలంబో, క్యాండీ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న జరిగే ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టోర్నీ ముగుస్తుంది.

ఇండో–పాక్ పోరు లేకుండానే..

ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట రాజకీయాలు ప్రధాన పాత్ర పోషించాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ పరిస్థితిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా రంగంలోకి దిగి ఇండియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాట్ చేయాలన్న నిర్ణయాన్ని సమర్థించారు.  గత కొన్నేండ్లుగా ఇండో–పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హై ఓల్టేజ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో టీమిండియాదే పూర్తి ఆధిపత్యం అయినప్పటికీ.. ఈ పోరుకు ఉండే కిక్కే వేరు. పాక్ ప్రభుత్వ నిర్ణయంతో  బంతి పడకముందే మొదలైన ఈ డ్రామా ఐసీసీకి, బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్టర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ ఇండో–పాక్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని మెగా టోర్నీని ఊహించుకోవడమే కష్టంగా ఉంది.


రోకో  లేకుండా తొలిసారి.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సూర్య మొదటిసారి

ఈ మెగా టోర్నీలో ఇండియా ఇద్దరు లెజండ్స్ లేకుండా బరిలోకి దిగుతోంది. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కప్పు అందుకున్న రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పారు. 2007లో ఇండియా తొలి టీ20 కప్ నెగ్గిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ 2024 వరకూ ప్రతీ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఈ మెగా టోర్నీలో ఆడాడు. ‘రోకో’ లాంటి స్టార్లు లేకుండా ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా బరిలో నిలిచింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది తొలి ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తన ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్ట్యా ఇదే చివరిది అయ్యే చాన్సుంది. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిల్లర్  క్యాచ్ పట్టి  జట్టుకు కప్పు తెచ్చిపెట్టిన సూర్య ఈసారి లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి.

ఏ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరు

గ్రూప్-ఎ: ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.
గ్రూప్-బి: శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్.
గ్రూప్-సి: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్-డి: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఏఈ, కెనడా

మినీ ఇండియాతోమనోళ్ల  తొలి సమరం

వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా తన టైటిల్ వేటను ప్రారంభించనుంది. అమెరికా జట్టులో చాలా మంది మన దేశ మూలాలున్న ఆటగాళ్లు ఉండటం విశేషం. ఓ రకంగా అది మినీ ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపిస్తోంది. ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, శుభమ్ రంజనే ఇప్పుడు అమెరికా జెర్సీలో తమ సొంత మైదానంలో బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురికీ వాంఖడే వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంచి అనుభవం ఉంది. గత వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి, ఇండియాకు గట్టి పోటీనిచ్చి సూపర్–8కు చేరిన అమెరికాను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన వామప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 7 రన్స్ తేడాతో ఓడిపోయిన అమెరికా తమ పోరాట పటిమను చాటుకుంది. అయితే, ఇండియా బౌలింగ్ దాడిని అమెరికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.

వాంఖడేలో ఓపెనింగ్ సెర్మనీ

ఇండియా–యూఏఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు వాంఖడే స్టేడియంలో  ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి, సితార్ విద్వాంసుడు రిషబ్ శర్మ సంగీత ప్రదర్శనతో వేడుకలు మొదలవుతాయి. బాలీవుడ్ డ్యాన్సర్ నోరా ఫతేహి, రాపర్ బాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ వేడుకలో హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ఆకాశం నుంచి స్టేడియంలోకి తీసుకురానున్నారు.

ఫేవరెట్ కాదు డేంజరస్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాదు డేంజరస్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ  చెప్పిన మాట ఇది. రాజకీయ అనిశ్చితి ఎలా ఉన్నా, క్రికెట్ పరంగా మాత్రం మన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ టోర్నీలోనే తిరుగులేని ఆధిపత్యం కలిగిన జట్టుగా కనిపిస్తోంది. రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు లేకపోయినా, 2024లో టైటిల్ గెలిచినప్పటి నుంచి ఇండియా అద్భుత ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. గత ఏడాది కాలంలో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా తొమ్మిది సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గెలిచి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ తిరిగి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరట. ఇషాన్ కిషన్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు. టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిగ్గా సరిపోయే దూకుడు అభిషేక్ శర్మ సొంతం. మిడిల్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిలక్ వర్మ, ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, ఫినిషర్ రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా, అతనికి తోడుగా అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్ ఉన్నాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థులను తిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2007 వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా ఎంతటి ఆధిపత్యాన్ని చూపెట్టిందో ప్రస్తుత ఇండియా అలానే ఉందని మాజీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లకు తుది జట్టులో చోటు దక్కకపోవడమే ఇండియా బెంచ్ బలానికి నిదర్శనం. 

ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటలీ జట్టు అరంగేట్రం చేస్తోంది.

ఇండియా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 2016 టోర్నీని నిర్వహించింది. 2021 ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా ఆతిథ్య దేశం అయినా కరోనా కారణంగా యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  షిఫ్ట్ చేశారు. 

 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు రెండేసి సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.
   2024లో ఇండియా ఓటమి లేకుండా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.

  • బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ ఈ టోర్నీలో అత్యధిక 50   వికెట్లు తీశాడు.
  •  
  •  ఈ టోర్నీలో అత్యధిక 1,292   రన్స్ చేసిన క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. 
  • వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 
  • పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌xనెదర్లాండ్స్ 
  • వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌xస్కాట్లాండ్ 
  • ఇండియాx అమెరికా 
  • స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జియో హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌