- ఆరోసారి కప్పు నెగ్గిన కుర్రాళ్లు
- 14 ఏండ్ల వైభవ్ రికార్డు సెంచరీ
- ఆరోసారి అండర్–19 వరల్డ్ కప్ సొంతం
- ఫైనల్లో 100 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ
- వైభవ్ సూర్యవంశీ వన్ మ్యాన్ షో
16 సార్లు టోర్నీ.. 10 సార్లు ఫైనల్స్.. 6 సార్లు చాంపియన్లు.. అండర్–19 వరల్డ్ కప్‌లో టీమిండియా కుర్రాళ్ల ఆధిపత్యం ఇది. 1988లో తొలిసారి టోర్నీ మొదలైతే.. 2000లో కైఫ్ సారథ్యంలో తొలి ట్రోఫీ నెగ్గిన ఇండియా.. 2026లో ఆరో కప్‌తో మెరిసి మురిసింది. లీగ్ దశ నుంచి అపజయమే లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. టైటిల్ ఫైట్‌లోనూ తడాఖా చూపెట్టింది. వన్ మ్యాన్ షో చూపెట్టిన వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్‌కు రికార్డులు మూగబోగా.. ఇంగ్లండ్ బౌలర్లు చేష్టలుడిగారు. ఫలితంగా హోరాహోరీ అనుకున్న ఫైనల్ కాస్త ఏకపక్షంగా మారిన వేళ.. ఇండియా 100 రన్స్ తేడాతో ఇంగ్లిష్ టీమ్‌పై అద్భుత విజయం సాధించి కప్‌తో సిక్సర్ కొట్టింది.
80 బాల్స్‌లో 17515 ఫోర్లు, 15 సిక్సర్లు..
హరారే:
బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (80 బాల్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175) వన్ మ్యాన్ షో చూపెట్టడంతో.. ఇండియా రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్–19 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53), అభిగ్యాన్ కుండు (40) కూడా అండగా నిలవడంతో.. శుక్రవారం జరిగిన మెగా ఫైనల్లో ఇండియా 100 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 411/9 స్కోరు చేసింది. తర్వాత ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో311 రన్స్‌కు ఆలౌటైంది. కాలెబ్ ఫాల్కనర్ (115), బెన్ డాకిన్స్ (66), బెన్ మేయెస్ (45) పోరాడి విఫలమయ్యారు. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.
రికార్డులే.. రికార్డులు
ఫ్లాట్ పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన వైభవ్ పవర్ హిట్టింగ్‌తో ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. నాలుగో ఓవర్‌లో ఆరోన్ జార్జ్ (9) ఔటైనా.. వైభవ్ 25.3 ఓవర్ల పాటు పరుగుల సునామీ సృష్టించాడు. స్టార్టింగ్‌లో ఫోర్లతో మొదలుపెట్టి.. ఆ తర్వాత లాంగాన్, లాంగాఫ్, మిడాన్, ఎక్స్‌ట్రా కవర్స్.. ఇలా ఒక్కటేంటి గ్రౌండ్ నలు వైపుల భారీ సిక్సర్లు బాదాడు. 8వ ఓవర్‌లో ఆయుష్ 4, 4, 6 బాదితే, తర్వాతి ఓవర్‌లో వైభవ్ 6, 4, 4, 4 దంచాడు. ఆ తర్వాత ఫోర్, సిక్స్‌తో 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. మాత్రే సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే, సూర్యవంశీ15వ ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. 17వ ఓవర్‌లో 6, 6, 4, 6తో 22 రన్స్ రాబట్టాడు. అయితే 19వ ఓవర్‌లో మాత్రే ఫోర్‌తో 50 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టినా.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. రెండో వికెట్‌కు 142 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 20 ఓవర్‌లో సింగిల్‌తో వైభవ్ 55 బాల్స్‌లో సెంచరీ అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో 4, 6, 6తో 19 రన్స్ చేసిన వైభవ్ 22వ ఓవర్‌లో 4, 6, 6, 4, 4తో 27 రన్స్ దంచాడు. 23వ ఓవర్‌లో 13వ సిక్స్‌తో 71 బాల్స్‌లో 150 మార్క్‌ను అందుకున్నాడు. వేదాంత్ త్రివేది (32) ఫోర్‌తో టచ్‌లోకి రాగా, వైభవ్ విధ్వంసం మాత్రం ఆగలేదు. 4, 6, 6, 4తో 175 రన్స్‌కు చేరాడు. కానీ 26వ ఓవర్‌లో లుమ్స్‌డెన్ (1/81) బాల్‌ను లెఫ్ట్ సైడ్ హుక్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో మెగా కప్‌లో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది. త్రివేదితో కలిసి విహాన్ మల్హోత్రా (30), అభిగ్యాన్ కుండు కీలక భాగస్వామ్యాలు జోడించారు. చివర్లో అంబరీష్ (18), ఖిలాన్ పటేల్ (3), హెనిల్ పటేల్ (5) ఫెయిలైనా.. కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. జేమ్స్ మింటో 3, మోర్గాన్, గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు.
ఫాల్కనర్ సెంచరీ వృథా
భారీ ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు మెరుగైన ఆరంభం లభించింది. 19 రన్స్ వద్ద జోసఫ్ మూర్స్ (17) ఔట్‌కాగా.. డాకిన్స్, మేయెస్‌తో రెండో వికెట్‌కు 74, థామస్ రే (31)తో మూడో వికెట్‌కు 49 రన్స్ జత చేశాడు. మిడిల్‌లో ఫాల్కనర్ ఈజీగా రన్స్ సాధించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కానీ మూడు రన్స్ తేడాలో రే, డాకిన్స్, రాల్ఫి అల్బెర్ట్ (0), ఫర్హాన్ అహ్మద్ (1), సెబాస్టియన్ మోర్గాన్ (0) ఔట్ కావడంతో ఇంగ్లండ్ 177/7తో ఎదురీత మొదలుపెట్టింది. 63 బాల్స్‌లో సెంచరీ చేసిన ఫాల్కనర్‌తో కలిసి మింటో (28) ఎనిమిదో వికెట్‌కు 92 రన్స్ జోడించి ఇండియా విజయాన్ని ఆలస్యం చేశాడు. కానీ 42 రన్స్ తేడాలో చివరి మూడు వికెట్లు పడటంతో ఇంగ్లండ్‌కు భారీ ఓటమి తప్పలేదు. అంబరీష్ 3, దేవేంద్రన్, కనిష్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 411/9 (సూర్యవంశీ 175, ఆయుష్ 53, జేమ్స్ మింటో 3/63).
ఇంగ్లండ్: 40.2 ఓవర్లలో 311 ఆలౌట్ (ఫాల్కనర్ 115, డాకిన్స్ 66, అంబరీష్ 3/56).
- అతి పిన్న వయసు (14 ఏళ్ల 316 రోజులు)లో అండర్–19 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. బాబర్ ఆజమ్ (15 ఏళ్ల 92 రోజులు) రికార్డును బ్రేక్ చేశాడు.
- అండర్–19 వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ వైభవ్ (55 బాల్స్). ఇదే టోర్నీలో విల్ మలాజ్చుక్ (ఆస్ట్రేలియా, 51 బాల్స్) ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.
- మెగా టోర్నీలో సెంచరీ చేసిన మూడో ఇండియన్ సూర్యవంశీ. ఉన్ముక్త్ చంద్, మన్‌జోత్ కల్రా ముందున్నారు.
- ఈ టోర్నీలో వైభవ్ చేసిన హాఫ్ సెంచరీలు. అన్నీ కూడా వంద శాతం స్ట్రయిక్ రేట్‌తో సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
- 30ఈ టోర్నీలో సూర్యవంశీ కొట్టిన సిక్సర్లు. డెవాల్డ్ బ్రెవిస్ (18), ఫిన్ అలెన్ (18) రికార్డును బ్రేక్ చేశాడు. యూత్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (15) నమోదు చేసిన రికార్డు కూడా వైభవ్‌దే.
- 71అండర్-19 వరల్డ్ కప్‌లో అతి తక్కువ బాల్స్‌లో 150 రన్స్ చేసిన తొలి బ్యాటర్ సూర్యవంశీ. బెన్ మేయెస్ (98 బాల్స్)ను అధిగమించాడు.
- 110యూత్ వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్ (25) ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ వైభవ్.
- 175ఇండియా యూత్ వన్డేల్లో రెండో హైయెస్ట్ స్కోరు చేసిన వైభవ్. రాయుడు (177*) ముందున్నాడు.
- 411/9అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు చేసిన తొలి జట్టు ఇండియా. ప్లే ఆఫ్ మ్యాచ్‌లోనూ అత్యధిక స్కోరు చేసిన జట్టు ఇండియానే. నమీబియాపై చేసిన 349/6 స్కోరును అధిగమించింది.
