లా నూసియా (స్పెయిన్): తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్.. బాక్సింగ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ 60 కేజీ క్వార్టర్‌ఫైనల్లో హుస్సాముద్దీన్.. అలీ దహ్లి (ఉక్రెయిన్)పై నెగ్గాడు. బౌట్ ఆరంభం నుంచే బలమైన హుక్స్, అప్పర్ కట్స్‌తో చెలరేగిన ఇండియన్ బాక్సర్ ప్రతి రౌండ్‌లో ఆధిపత్యం చూపెట్టాడు. ఫలితంగా ఏకగ్రీవంగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
55 కేజీల్లో జాదుమణి సింగ్ 5–0తో పెంగ్ చై ఫెంగ్ (చైనీస్‌తైపీ)పై, సచిన్ (60 కేజీ) 3–2తో ఐడెర్ అబ్దురైమోవ్ (ఉక్రెయిన్)పై, ఆకాశ్ (75 కేజీ) 4–1తో జోస్ లూయిస్ కనెరో (స్పెయిన్)పై గెలిచారు. పవన్ బర్త్‌వాల్, అభిమన్యు జమ్వాల్ తమ ప్రత్యర్థుల చేతిలో కంగుతిన్నారు. విమెన్స్ 54 కేజీ క్వార్టర్స్‌లో ప్రీతి పవార్.. మరియా గోంజాలెజ్ (స్పెయిన్)పై, నీతూ (51 కేజీ).. మెకంజీ రైట్ (కెనడా)పై ఏకగ్రీవంగా నెగ్గారు. 54 కేజీ క్వార్టర్స్‌లో పూనమ్ 5–0తో నట్చినా చోంగ్‌ప్రోంగ్‌కలాంగ్ (థాయ్‌లాండ్)పై, ప్రియా (60 కేజీ).. లారా గలానో (స్పెయిన్)పై, ప్రాంజల్ (65 కేజీ).. విక్టోరియా జిల్కోవా (చెక్)పై విజయాలు సాధించారు. 65 కేజీల్లో కాజల్ 4–1తో అక్బర్ ఇచనోవా (కజకిస్తాన్)ను ఓడించింది.
