కింగ్‌డావో: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఇండియాఅమ్మాయిల జట్టు ఆశలు ఫలించలేదు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 0–3తో చైనా చేతిలో
ఓడి ఇంటిముఖం పట్టింది. తొలి సింగిల్స్‌లో తన్వీ శర్మ 9–21, 9–21తో వరల్డ్ పదో ర్యాంకర్ గావో ఫెంగ్ జి చేతిలో ఓడింది.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇండియన్ అమ్మాయిలు ఏ దశలోనూ పుంజుకోలేకపోయారు. మెన్స్ జట్టు 1–3తో కొరియా చేతిలో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్‌లో ఆయుష్ షెట్టి 21–18, 14–21, 24–26తో యూ టి బిన్ చేతిలో ఓడగా, మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–చిరాగ్ షెట్టి 11–21, 13–21తో సాంగ్ హున్ చో–కిమ్ వోన్ హో చేతిలో ఓడారు. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో చోయ్ జిహోన్‌పై గెలిచినా.. పృథ్వీ–సాయి ప్రతీక్ 11–21, 16–21తో జిన్ యంగ్–కి డాంగ్ జి చేతిలో ఓడటంతో ఇండియాకు పరాజయం తప్పలేదు.
